ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘జనసేన’ ఇక జనముందుకు రావడం ఖాయం
అని తేలింది. ఈ నెల 14న హైటెక్స్ లో పవన్ కళ్యాణ్ రాజకీయాల మీద తాను రాసిన ఓ
పుస్తకాన్ని విడుదల చేస్తారని
భావించారు. కానీ దానిని ఈ నెల 30 కి వాయిదా వేశారు. ఈ నెల 14న వేదికను
నోవాటెల్ కు మార్చారు. అక్కడ రాజకీయ పార్టీ ప్రకటన కొరకు ఆరు హాళ్లను బుక్
చేశారు. ఈ వేదిక నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ‘జన సేన’ పార్టీని
ప్రకటించనున్నారు.
ఈ మేరకు జాతీయ మీడియాకు, స్థానిక మీడియాకు అన్ని వివరాలు అందాయని, ఆ
రోజు తెలంగాణ, సీమాంధ్రలతో పాటు బెంగుళూరు ఇతర నగరాలలో పెద్ద పెద్ద
స్క్రీన్లతో పార్టీ ఆవిర్భావాన్ని వెల్లడిస్తారని సమాచారం. షట్చక్రం పార్టీ
గుర్తుగా నిర్ణయించారు. ఇది ఎరుపురంగులోని జెండా మీద ఉంటుంది. పవన్ పార్టీ
జెండా ఇజ్రాయిల్ జెండాను పోలి ఉంటుందని సమాచారం. పార్టీకి సంబంధించిన
మొత్తం వ్యూహకర్త త్రివిక్రమ్ శ్రీనివాస్ అని సమాచారం. ఇక పవన్ పార్టీ
తరపున పోటీ చేసే అభ్యర్థులందరూ వేరు వేరు గుర్తుల మీద పోటీ చేయనున్నారు.
పార్టీ రిజిస్టర్ చేసేందుకు ఇప్పుడు అవకాశం లేకపోవడం.. ఒకే గుర్తు వచ్చే
అవకాశం లేకపోవడం దీనికి కారణం అని తెలుస్తుంది. ఇక తెలంగాణలో సామాజిక
తెలంగాణ, సీమాంధ్రలో ప్రశ్నించడం కోసం పార్టీ పేరుతో ఎన్నికలకు
వెళ్లనున్నారు.
No comments:
Post a Comment