Pages

Tuesday, October 29, 2013

యాంటిబయాటిక్స్ అంటే ఏమిటి ? అవి ఎప్పుడు వాడాలి ?

మనకు ఏ వ్యాధి వచ్చినా వైద్యుని దగ్గరకు వెళ్లగానే అందులో యాంటీబయాటిక్స్ రాస్తారు. అసరు యాంటిబయాటిక్స్ అంటే ఏమిటి ? అవి ఎప్పుడు వాడాలి ? మనకు జ్వరం రాగానే మనం స్వంతంగానే పారసిటమాల్ తో పాటు ఓ యాంటిబయాటిక్ తేలిగ్గా వాడేస్తాం. కానీ అది తప్పు. రెండు రోజుల పాటు పారసిటమాల్ వాడిన తరువాత అప్పటికి జ్వరం తగ్గకుంటే వైద్యుని సలహామేరకు పరీక్షలు చేయించుకున్నతరువాత యాంటిబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది.
ఈ యాంటీ బయాటిక్స్‌ సాధారణంగా ఇంజక్షన్ల రూపంలో ఉంటాయి. టాబ్లెట్ల రూపంలో ఉండే యాంటి బయాటిక్స్‌లలో సల్ఫర్‌ ఉంటుంది. ఇది మోతాదు ఎక్కువైతే చర్మం మీద నల్లటి మచ్చలు వస్తాయి. ఆ మచ్చల వద్ద దురద కూడా వస్తుంది. ఇలా మచ్చలు వచ్చిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
 డాక్టర్లు రోగిని పరీక్షించి యాంటి బయాటిక్స్‌కు రియాక్షన్‌ కలగకుండా మందులిస్తారు. కొన్ని రకాల యాంటి బయాటిక్స్‌తో వాంతులు, వికారాలే కాకుండా కడుపులో మంట కూడా వస్తుంది. ఈ తరహా మందులతో కొన్ని సార్లు విరేచనాలు తగ్గడానికి వేరే మందులు వాడకుండా యాంటి బయాటిక్స్‌ వాడడం ఆపేస్తే సరిపోతుంది. యాంటిబయాటిక్స్‌తో దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఏ మందులనైనా డాక్టర్‌ సూచించిన పరిమిత కాలం వరకే వాడాలి. కానీ, చాలా మంది ఒకసారి సూచించిన మందులను ఏళ్ల తరబడి వాడేస్తుంటారు. ఇలా వైద్యుని ప్రమేయం లేకుండా మందులు వాడుతున్నప్పుడు వెంటనే ఏ ప్రభావం చూపించక పోవచ్చు కానీ దీర్ఘకాలంలో వాటి ప్రభావం దేహంపై తప్పక పడుతుంది. శరీరంలోని కాలేయం వంటి అవయవాల మీద ఈ యాంటి బయాటిక్స్‌ ప్రభావం పడి, అది జాండిస్‌ వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. అనాల్జిన్‌, బెరాల్గన్‌, అవిల్‌ వంటి ఇంజక్షన్లు ఎక్కువ కాలం పాటు తీసుకుంటే అవి కిడ్నీల మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకనే ఏ మందులనైనా వైద్యుల సలహా, సూచనలను ప్రకారమే వాడాలి.
ఏదైనా వ్యాధి సోకినప్పుడు అవసరమైన రక్త మూత్ర పరీక్షలన్నీ చేయించుకోవడం అవసరం. దీనివల్ల వ్యాధికి తగిన మందులు రాసే అవకాశం వైద్యునికి దొరుకుతుంది. వ్యాధిని బట్టే యాంటీ బయాటిక్స్‌ వాడే కాలవ్యవధి ఉంటుంది. కొన్ని సార్లు వైద్యులు  సూచించిన గడువుకన్నా ముందే వ్యాధి నుండి ఉపశమనం లభించవచ్చు. అలా ఉపశమనం లభించగానే మందులు వాడడం ఆపేస్తారు. అలా ఆపేయడం కూడా మంచిది కాదు. సమస్య తగ్గినా వైద్యుడు చెప్పే వరకు మందుల వాడకాన్ని కొనసాగిస్తూనే ఉండాలి

No comments:

Post a Comment