Pages

Tuesday, December 3, 2013

గబ్బర్ సింగ్ కు ఏమయింది ?

బ్బర్ సింగ్ హిట్ తో టాప్ రేంజ్ కు వెళ్లిపోయిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమా హిట్ ఎవరి అంచనాలకు అందని ఎత్తుకు ఎదిగిపోయాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా రోజుల తరువాత వచ్చిన ఈ కుటుంబ కథా చిత్రం ఎక్కడా ఎలాంటి అసభ్యకర దృశ్యాలు లేకుండా ..కుటుంబ సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తూ తీయడం అందరినీ అలరింపజేసింది. అయితే ఇంత హిట్ చిత్రం తరువాత ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం ఏది అన్నది ఎవరికి తెలియడం లేదు.

 
గబ్బర్ సింగ్ 2 చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. గత నెల చివర్లోనే మొదలవుతుందునుకున్న ఈ సినిమా ఈ నెలకు వచ్చింది. ఇప్పుడు వచ్చే ఏడాది జనవరిలో మొదలవుతుందని తాజా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా సెట్స్ మీదకే సినిమా వెళ్లకుంటే విడుదలయ్యేది ఎప్పుడా అని పవన్ అభిమానులు మదన పడుతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మిత్రుడు శరత్ మరార్ ఈ సినిమా నిర్మిస్తున్నాడు. చంబల్ లోయ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఎలా ఉంటుందా ? అని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.


source 

1 comment: