భారత జట్టు ఒక్క పరుగుతో
ప్రపంచ రికార్డును నెలకొల్పనుంది. డిసెంబర్ 5న దక్షిణాఫ్రికాతో తొలి
అంతర్జాతీయ వన్డే మ్యాచులో ఒక్క పరుగు చేయడం ద్వారా భారత జట్టు వన్డే
మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సాధించనుంది.
భారత
కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ సిరీస్‌లో రెండు వ్యక్తిగత
రికార్డులను అధిగమించే అవకాశం ఉంది. వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన భారత
కెప్టెన్‌గా, ఎక్కువ విజయాలు అందించిన సారథిగా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు
సృష్టించనున్నాడు.
ప్రస్తుతం
151 వన్డేల్లో 5,213 పరుగులు చేసిన ధోనీ, మాజీ కెప్టెన్ అజహరుద్దీన్
సాధించిన 174 వన్డేల్లో 5,239లకు 26 పరుగులతో వెనకబడి ఉన్నాడు. మూడు వన్డేల
సిరీస్‌ను క్వీన్ స్వీప్ చేస్తే భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన
కెప్టెన్‌గా ధోనీ మరో రికార్డును నెలకొల్పే అవకాశం ఉంది.
అజహరుద్దీన్ 90 మ్యాచుల్లో జట్టుకు విజయాన్నందించగా.. మహేంద్ర సింగ్ ధోనీ 88 మ్యాచుల్లో భారత జట్టును గెలిపించాడు.
ప్రస్తుతం
అంతర్జాతీయ వన్డే మ్యాచుల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు 1,82,881 పరుగులు
సాధించి సమాన స్థాయిలో ఉన్నాయి. భారత జట్టు ఈ పరుగులను 841 వన్డేల్లో
చేయగా, ఆస్ట్రేలియా 825 మ్యాచుల్లో సాధించింది. ఆస్ట్రేలియా 505 వన్డేల్లో
గెలిచి మెరుగైన విజయశాతం కలిగి ఉండగా, భారత్ 423 వన్డేల్లో విజయం
సాధించింది.
No comments:
Post a Comment